ప్రస్తుతానికి మంచోడిలా ఉందామనుకుంటున్నాను

15 Sep, 2018 00:38 IST|Sakshi
ఆది పినిశెట్టి

‘‘ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ బాగా వస్తున్నాయి. మెల్లిగా గేమ్‌ చేంజ్‌ అవుతోంది. ఆడియన్స్‌ అభిరుచులు మారుతున్నాయి. అందుకే ఏ పాత్ర చేసినా ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను. మంచి సినిమాలో భాగం అవ్వాలని అనుకుంటా. నా కెరీర్‌లో బెస్ట్‌ మూవీస్‌లో ‘యు టర్న్‌’ తప్పకుండా ఉంటుంది’’ అని ఆది పినిశెట్టి అన్నారు. సమంత మెయిన్‌ లీడ్‌గా ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘యు టర్న్‌’. కన్నడ ‘యు టర్న్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. పవన్‌ కుమార్‌ దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజ్‌ అయింది. ఈ సందర్భంగా ఆది పలు విశేషాలు పంచుకున్నారు.

► సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.  చిన్న పాయింట్‌ అయినా ఆసక్తి కలిగించేలా దర్శకుడు పవన్‌ చెప్పారు. సామాజిక స్పృహ ఉన్న కథను బోధించినట్టు కాకుండా కమర్షియల్‌గా చెప్పారు.    

► కర్మ సిద్ధాంతం. మనం ఏదైనా తప్పు చేస్తే అది మళ్లీ మనకే వస్తుంది అన్నదే ఈ సినిమా కథ.

► ‘వైశాలి’ తర్వాత మళ్లీ పోలీస్‌ పాత్ర చేశాను. పోలీస్‌ అనగానే స్లో మోషన్‌ షాట్స్, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉండాలనుకోను. ఈ సినిమాలో ఏ ఇంట్రడక్షన్‌ ఉండదు. సాధారణ పాత్రలానే ఎంటర్‌ అవుతాను. ఇదే నా కెరీర్‌లో బెస్ట్‌ ఇంట్రడక్షన్‌. పవన్‌ నెక్ట్స్‌ జనరేషన్‌ డైరెక్టర్‌. తనకి చాలా ఫ్యూచర్‌ ఉంది.  ‘రంగస్థలం’ తర్వాత సమంతతో మరో సక్సెస్‌ షేర్‌ చేసుకోవడం హ్యాపీగా ఉంది.    

► సినిమాను అనలైజ్‌ చేసే వాళ్లు కేవలం 15 శాతం మంది ఉంటారు. మిగతా వాళ్లకు బావుందా బాలేదా అన్నదే ముఖ్యం. ‘నీవెవరో’ సినిమా కూడా కామన్‌ ఆడియన్స్‌కు నచ్చొచ్చు అన్నాను. కానీ క్రిటిక్స్‌ మీద కామెంట్‌ చేయలేదు. క్రిటిసిజిమ్‌ నుంచే నేర్చుకొంటాను. ఎప్పటికప్పుడు యాక్టర్‌గా ఇంప్రూవ్‌ అవ్వడానికి మీరిచ్చే (క్రిటిక్స్‌) ఫీడ్‌బ్యాకే ముఖ్యం. పబ్లిక్‌ ఫీడ్‌బ్యాక్‌ కూడా చూస్తుంటాను. 

► సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టీవ్‌గా ఉండను. కొంతమంది సంబంధం లేకుండా నెగటివిటీ షేర్‌ చేస్తుంటారు. అలాంటి వాళ్లను పాపం అనుకొని పక్కన పెట్టేయడమే.

► ప్రస్తుతానికి మంచోడిలా ఉందాం అనుకుంటున్నాను. మంచి స్క్రిప్ట్‌ వస్తే అప్పుడు చెడ్డగా (విలన్‌) మారతాను. నెక్ట్స్‌ నాలుగు ప్రాజెక్ట్‌లు అనుకుంటున్నాను.

మరిన్ని వార్తలు