బుర్ర కథ చూడండహో

18 Aug, 2018 00:40 IST|Sakshi
ఆదిపై క్లాప్‌ ఇస్తున్న పరుచూరి గోపాలకృష్ణ

‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం ఆడోరకం, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ‘డైమండ్‌’ రత్నబాబు మెగా ఫోన్‌ పట్టారు. ఆది సాయికుమార్‌ హీరోగా ఆయన డైరెక్షన్‌లో ‘బుర్రకథ’ అనే సినిమా తెరకెక్కనుంది. దీపాల ఆర్ట్స్‌ పతాకంపై హెచ్‌కె శ్రీకాంత్‌ దీపాల నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రచయిత, పాటల రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా కెమెరా స్విచ్చాన్‌ చేయగా రచయిత పరుచూరి గోపాల కృష్ణ క్లాప్‌ ఇచ్చారు.

దర్శకుడు ‘డైమండ్‌’ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్‌గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టాప్‌ టెక్నీషియన్స్‌ని ఇచ్చి సపోర్ట్‌ చేసినందుకు నిర్మాతకి, నాపై నమ్మకంతో ఈ సినిమా చేస్తున్న ఆదిగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘బుర్రకథ’ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు ఆది సాయికుమార్‌. ‘‘ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. వారంలో హీరోయిన్స్, ఇతర నటీనటులను ఓకే చేయనున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్‌ దీపాల. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: రామ్‌ ప్రసాద్‌.

మరిన్ని వార్తలు