ఆది హీరోగా ‘బుర్రకథ’

17 Aug, 2018 08:57 IST|Sakshi

ఆది సాయికుమార్‌ కెరీర్‌ స్టార్టింగ్‌లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్‌లు వచ్చినా.. మళ్లీ అలాంటి విజయాలు రాలేదు. మధ్యలో రూట్‌ మార్చి మల్టిస్టారర్‌ సినిమాల్లో నటించిన కలిసి రాలేదు. ఆది హీరోగా గతేడాది వచ్చిన ‘నెక్స్ట్‌ నువ్వే’ సినిమా ఫర్వాలేదనిపించింది. 

ఆది తన మార్కెట్‌ను నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఆదికి సరైన హిట్‌ కావాలి. మాటల రచయిత డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా మారి ఆది హీరోగా చేస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతాన్ని అందించనున్నారు. దీపాల ఆర్ట్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకాంత్‌ దీపాల నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు