వైరల్‌: చిరు ఎత్తుకున్న ఆ హీరో ఎవరు?

19 May, 2020 15:02 IST|Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ సెలెబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కుటుంబంతో సరదాగా గడుపుతూనే వీలుచిక్కినప్పుడల్లా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చిన్ననాటి ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా దండ వేయించుకుని.. షీల్డు కూడా అందుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు అప్పటి బుడ్డోడు ఇప్పటి యువ హీరో. 

ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు సాయికుమార్‌ వారసుడు ఆది. తన చిన్నతనంలో చిరుతో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఓ ఫోటోను షేర్ చేశాడు ఈ యంగ్‌ హీరో. ఇంతకీ ఆ కథ ఏంటంటే.. చంద్ర మోహన్, జయసుధ, సాయి కుమార్, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించిన 'కలికాలం' సినిమా 1991లో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమా 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇందుకు మెగాస్టార్ చేతుల మీదుగా సాయికుమార్‌కు ఇవ్వాల్సిన షీల్డ్‌ను ఆయన కొడుకు ఆదికి అందించారు. ఆ సమయంలో ఆదిని చిరు ఎత్తుకున్నారు. ఈ ఫొటోను ఆది తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ ఖాతాల్లో షేర్ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. 

చదవండి:
తెరపై ‘గోదావరి’ : అందరి మనసుల్లో పదిలంగా
హరీశ్‌ మరో చిత్రం.. పవన్‌ ఫ్యాన్స్‌కు డౌట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు