శశి కథేంటి?

24 Dec, 2019 00:14 IST|Sakshi
ఆది సాయికుమార్‌

డిసెంబర్‌ 23 ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా తన తాజా చిత్రం ‘శశి’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు చిత్రబృందం. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సురభి, రాశీ సింగ్‌ హీరోయిన్లు. ఆర్‌.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. గుబురు గడ్డంతో కోపంతో అరుస్తున్న పోజులో ఉన్న ఫొటోను ఫస్ట్‌ లుక్‌గా విడుదల చేశారు. ‘‘లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమాలో ఆది డిఫరెంట్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: అరుణ్‌ చిలువేరు, కెమెరా: అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి. 

మరిన్ని వార్తలు