కొత్తగా ఉన్నావు అంటున్నారు

17 Aug, 2019 00:35 IST|Sakshi
నరేశ్, విశ్వనాథ్, ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్, విజయలక్ష్మి

– ఆది సాయికుమార్‌

‘‘నేను ఓ రియలిస్టిక్‌ ఫిల్మ్‌ చేయాలనుకుంటున్న టైమ్‌లో విశ్వనాథ్‌ ఈ కథ గురించి చెప్పాడు. చాలా బాగుంది. మిమ్మల్ని ఈ సినిమాతో ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తా అనే నమ్మకముంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్‌. శ్రీనివాస్‌ గుర్రం సమర్పణలో విజయలక్ష్మీ నిర్మించారు. విశ్వనాథ్‌ అరిగెల దర్శకుడు. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్‌’ చిత్రం నాకు చాలా ఇష్టం.

ఆమె చాలా ప్రొఫెషనల్‌ ఆర్టిస్ట్‌. ఈ చిత్రం టీజర్‌ రిలీజయ్యాక అందరూ ఫోన్‌ చేసి ‘నువ్వు చాలా కొత్తగా ఉన్నావు’ అని అభినందించారు’’ అన్నారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో మొదౖలై ఇప్పుడు రిలీజ్‌ వరకు వచ్చింది. నిర్మాత విజయలక్ష్మీ ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది అంటే, హీరో అది ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు.  హీరోయిన్‌ శ్రద్ధా కథ వినగానే చేస్తున్నా అన్నారు. నరేశ్‌గారికి పాత్ర చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు ఫణికుమార్, నేను కొత్త ట్యూన్స్‌ కోసం ప్రయత్నించాం’ అన్నారు.

శ్రద్ధా మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను మరచిపోలేను. ‘జోడి’ కథ వింటూ చాలాసార్లు నవ్వుకున్నాను’’ అన్నారు. నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలు మోహమాటంతో, కొన్ని సినిమాలు ఆ సినిమా స్పాన్‌ చూసి చేస్తాం. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో న చ్చి చేశాను’’ అన్నారు. ‘‘నేచురల్‌గా ఉండే సినిమా చేద్దాం అనుకున్నాను. విశ్వనాథ్‌ ఈ కథ చెప్పగానే ఆదిగారు కరెక్ట్‌ అనిపించి ఆయనకు చెప్పాం. కథ వినగానే ఆది ఓకే అన్నారు. శ్రద్ధా మా సినిమాకు ఎస్సెట్‌ అవుతుంది’’ అన్నారు విజయలక్షి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి

నాకు నేను నచ్చాను

ధనుష్‌ కాదు ప్రశాంత్‌!

ముచ్చటగా మూడోసారి?

అభినేత్రికి అభినందనలు

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి