ప్రతిరోజు గర్వపడుతూ ఈ సినిమా చేశాను

21 Oct, 2019 01:41 IST|Sakshi
అబ్బూరి రవి, అడివి సాయికిరణ్, ఆది సాయికుమార్, కార్తీక్‌రాజు

– ఆది సాయికుమార్‌

వినాయకుడు టాకీస్‌ పతాకంపై ఆది సాయికుమార్‌ హీరోగా, రచయిత అబ్బూరి రవి విలన్‌గా, సాయికిరణ్‌ అడివి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆది మాట్లాడుతూ– ‘‘సినిమా చూసిన అందరూ నేను చేసిన అర్జున్‌ పండిట్‌ పాత్ర చాలా బావుందని అభినందిస్తున్నారు. ప్రతి రోజూ గర్వపడుతూ ఈ సినిమా చేశాను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ పాజిటివ్‌ రిపోర్ట్స్‌ చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ– ‘‘మా చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుండి సినిమా బావుంది అనే టాక్‌ రావడం ఆనందంగా ఉంది. సినిమా విజయం వెనక ఎంతో మంది ప్రోత్సాహం ఉంది. టెక్నీషియన్స్, మా టీమ్‌ అందరి హార్డ్‌ వర్క్‌తో ఈ సినిమా పూర్తయింది. సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్‌ రాజు, పార్వతీశం, పద్మనాభ రెడ్డి,  అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు