డైలాగ్స్‌ టు డైరెక్షన్‌

16 Jun, 2018 01:48 IST|Sakshi
రత్నబాబు, ఆది సాయికుమార్‌

రచయితల నుంచి దర్శకులుగా మారిన లిస్ట్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి.. ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రైటర్‌ డైమండ్‌ రత్నబాబు కూడా చేరిపోయారు.  ‘సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు డైలాగ్స్‌ అందించిన డైమండ్‌ రత్నబాబు దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టనున్నారు. ఆది సాయికుమార్‌ హీరోగా రత్నబాబు ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీపాల ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించనున్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం.

మరిన్ని వార్తలు