కమాండో అర్జున్‌ పండిట్‌

9 Nov, 2018 02:25 IST|Sakshi
ఆది సాయికుమార్

మైనస్‌ పది డిగ్రీల చలిలో దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఎన్‌.ఎస్‌.జీ కమాండో అర్జున్‌ పండిట్‌ ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ కోసం కష్టపడుతున్నారు. మరి.. ఆ ఆపరేషన్‌ టార్గెట్‌ ఎవరు? అనేది వెండితెరపై తెలుస్తుంది. ఆది సాయికుమార్, కార్తీక్‌ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్‌ ముఖ్య తారలుగా ‘వినాయకుడు’ ఫేమ్‌ అడివి సాయికిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’. ప్రతిభా అడవి, కట్ట ఆశిష్‌ రెడ్డి, కేశవ్, ఉమా స్వరూప్, పద్మనాభరెడ్డి, గేరి. బిహెచ్, సతీష్‌ డేగలతో పాటు కొందరు సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు నిర్మాతలు.

ఈ సినిమాకి పని చేసే యూనిట్‌ సభ్యులందరూ కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరో రానా విడుదల చేశారు. అర్జున్‌ పండిట్‌ అనే ఎన్‌.ఎస్‌.జీ కమాండోగా ఆది సాయికుమార్‌ నటిస్తున్నారు. ‘‘విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం మైనస్‌ పది డిగ్రీల చలిలో షూటింగ్‌ జరుపుతున్నాం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కల్పిత కథ ఇది. త్వరలో టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.

మరిన్ని వార్తలు