బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు!

5 Dec, 2013 01:35 IST|Sakshi
బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు!
‘‘ఈ సినిమాలో నా సిక్స్ ప్యాక్ బాడీ చూసి చాలామంది, నన్ను బాలీవుడ్ హీరోలతో పోలుస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని సుధీర్‌బాబు చెప్పారు. ఆయన హీరోగా నటించిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఈ నెల 7న విడుదల కానుంది. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. యూనిట్ సభ్యులకు షీల్డులందజేసిన అనంతరం నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ -‘‘సుధీర్‌బాబు కమిట్‌మెంట్, డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. రెండు సినిమాలతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు తను’’ అన్నారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు ఆకాంక్షించారు.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి