డీ గ్లామర్‌ లుక్‌ లో...

3 Feb, 2019 05:54 IST|Sakshi
మలయాళం యాక్టర్‌ పృథ్వీరాజ్‌

మలయాళం యాక్టర్‌ పృథ్వీరాజ్‌ కొత్త లుక్‌లోకి మారిపోయారు. డ్రీమ్‌బాయ్‌ లుక్‌లో కనిపించే ఆయన డీ గ్లామర్‌ రోల్‌లోకి చేంజ్‌ అయ్యారు. ఇదంతా ఆయన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ కోసమే. మలయాళ ఇండస్ట్రీలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘ఆడు జీవితం’ ఒకటి.  మలయాళంలోని ఓ ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ విభిన్న గెటప్స్‌లో కనిపిస్తారట. ఆ గెటప్స్‌లో ఇదొకటి. ఈ చిత్రానికి ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. 25 సంవత్సరాల తర్వాత మలయాళ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించనుండటం విశేషం. 2020లో రిలీజ్‌ కానున్న ఈ చిత్రంలో అమలా పాల్‌ కథానాయిక.

మరిన్ని వార్తలు