తప్పు నాదే, క్షమించండి: ఆమిర్‌ ఖాన్‌

27 Nov, 2018 09:51 IST|Sakshi

బాలీవుడ్‌కు ఈ ఏడాది కచ్చితంగా గుర్తుండిపోతుంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. బాహుబలి రికార్డులను వేటాడటానికి బరిలోకి దిగిన ఈ సినిమా.. పెట్టిన దాంట్లో కనీసం సగంవరకు కూడా రాబట్టలేక చతికిలబడిపోయింది. ఇంతటి పరాభవాన్ని ఆమిర్‌ మునుపెన్నడూ ఎదుర్కోలేదు. గత కొంతకాలంగా ఆమిర్‌ తన సినిమాలతో బాక్సాఫీస్‌ దాడి చేస్తుండగా.. ఈ చిత్రం కూడా సక్సెస్‌ అవుతుందని అందరూ అనుకున్నారు. 

అయితే ఈ చిత్రం పరాజయం కావడానికి తానే కారణమని, ఆ తప్పును తనమీదే వేసుకున్నాడు ఆమిర్‌ ఖాన్‌. అయితే ఏదైనా సినిమా ఫెయిల్‌ అయితే హీరోలు బయటకురావడానికి కూడా ఇష్టపడరు. కానీ ఆమిర్‌ మాత్రం అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకులను అలరించలేపోయినందుకు క్షమాపణలను కోరారు.

దీనిపై ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ స్పందిస్తూ.. ఈ ఆటలో గెలుపోటములు సహజమని ఆమిర్‌ తప్పక మళ్లీ తన స్టామినా ఏంటో చూపిస్తారనే నమ్మకం మాకుందని.. ఓటమిని ఒప్పుకోవడం చాలా కొద్దిమంది స్టార్స్‌లోనే చూశానని ఆమిర్‌కు ఎంతో ధైర్యం ఉందని.. అందుకే ఈ మూవీ ఫెయిల్యూర్‌ను తన భుజాన వేసుకున్నారని అన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా