వ్యోమగామిగా ఆమిర్ ఖాన్

10 Jun, 2016 12:50 IST|Sakshi

బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పికె సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత కూడా బయోపిక్లోనే నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.