ది బెస్ట్‌ టీం ఇదే: కరీనా కపూర్‌

12 Nov, 2019 15:01 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌, కరీనా కపూర్‌ఖాన్‌ జంటగా నటిస్తున్నకొత్త సినిమా ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర బృందం షూటింగ్‌ కోసం ప్రస్తుతం చండీఘడ్‌లో ఉంది. పలు సన్నివేశాల షూట్‌ పూర్తి చేసుకున్న చిత్రబృందం సభ్యులు అందరూ సరదాగా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో హీరో అమీర్‌ఖాన్‌, హీరోయిన్‌ కరీనా కపూర్‌, సినిమా యూనిట్‌తో పాటు అమీర్‌ భార్య కిరణ్‌రావు కూడా ఉన్నారు. దీంతో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చిత్రం హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఓ ఫోటోను తన ఇస్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘ది బెస్ట్‌ టీమ్‌’ అని కామెంట్‌ చేశారు. ఇటీవల ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌ సమయంలో లీకైన కరీనా, అమీర్‌ ఖాన్‌ల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 
 

The Best Team ❤️❤️❤️❤️ #lalsinghchaddha #chandigarhnights @nainas89 nainas89 @poonamdamania @makeupbypompy

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

అమీర్‌ ఇటీవల​ ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు. లాల్‌సింగ్‌ చద్దా.. వచ్చే ఏడాది  క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అదే విధంగా ఈ ఏడాది తన పుట్టిన 54వ పుట్టినరోజు సందర్భంగా అమీర్‌ ఖాన్‌ అద్వైత్ చందన్ దర్శకత్వంలో ‘ఫారెస్ట్ గంప్’ హిందీ రీమేక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు వెల్లడించారు. 1994లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రంలో టామ్ హాంక్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసందే.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా