'అత‌న్ని చాలా మిస్ అవుతాము'

13 May, 2020 11:58 IST|Sakshi

ముంబై :  బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్‌కు సుదీర్ఘ‌‌కాలం అసిస్టెంట్‌గా ప‌నిచేసిన అమోస్ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.  60 ఏళ్ల అమోస్‌కు ఉద‌యం గుండెపోటు రావ‌డంతో ఆమిర్‌, అత‌ని భార్య కిర‌ణ్ రావు అత‌న్ని హోలి ఫ్యామిలీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ అమోస్ అదే రోజు తుదిశ్వాస విడిచారు. కాగా గ‌త 25 ఏళ్లుగా అమోస్ ఆమిర్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు. అత‌నికి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. (విరాటపర్వం: సాయిపల్లవి నక్సలైట్‌ కాదు! )

అమోస్ సూప‌ర్‌స్టార్ ఆమిర్‌తో క‌లిసి చాలాకాలం ప‌నిచేశార‌ని, ఆయ‌న‌ ఎంతో విన‌యంగా ఉండేవార‌ని ఆమిర్ స్నేహితుడు, లాగాన్ స‌హ‌న‌టుడు క‌రీం హాజీ తెలిపారు. 'అత‌ను ఒక అద్భుతమైన వ్య‌క్తి. అంద‌రితో స‌న్నిహితంగా ఉండేవాడు. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవాడు'. అని పేర్కొన్నారు. అయితే అమోస్ ఆరోగ్యం‌ పెద్ద‌గా చెడిపోలేద‌ని ఆయ‌న‌ అన్నారు. 'ఈ స‌మ‌యంలో ఆయ‌న మ‌ర‌ణించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. అమోస్ మ‌‌‌ర‌ణంతో ఆమిర్‌, కిర‌ణ్ ఇద్ద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణం తీర‌ని లోటు. మేము అత‌నిని కోల్పోయాము. అమోల్‌ను చాలా మిస్ అవుతాము' అని విచారం వ్య‌క్తం చేశారు. (ఫైట్స్‌ బ్యాలెన్స్‌ గురూ)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా