ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు

16 Jan, 2020 13:36 IST|Sakshi

తన ప్రేమ విషయాన్ని దాచాలనుకోవడం లేదని.. అలా అని బహిర్గత పరచాలనుకోవడం లేదని బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్‌ అన్నారు. తన మనసుకు ఏది తోస్తే.. అదే చేస్తానని స్పష్టం చేశారు. మ్యూజిక్‌ కంపోజర్‌ మిషాల్‌ కృపలానీతో డేటింగ్‌ చేస్తున్నట్లు ఇరా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మీరెవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అన్న నెటిజన్‌ ప్రశ్నకు బదులుగా.. మిషాల్‌ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇరా షేర్‌ చేశారు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ... ‘ నేను ఏదీ దాయాలని ప్రయత్నం చేయలేదు. సోషల్‌ మీడియాలో నాకు నచ్చిన పోస్టులు పెడతాను. ఫొటోలు షేర్‌ చేస్తాను. నేను ఏంటీ అనే నిజాన్ని ప్రతిబింబించేలా నా పోస్టులు ఉంటాయి’అని పేర్కొన్నారు.

అదే విధంగా... ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని బట్టి తన ప్రవర్తన ఉంటుందని ఇరా చెప్పుకొచ్చారు. కాగా ఇరా ఖాన్‌ త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఓ థియేటర్‌ డ్రామా దర్శకురాలిగా ఆమె మెగాఫోన్‌ పట్టనున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొంతకాలంగా ఫోటోషూట్‌లతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఇరా తన డ్రెస్సింగ్‌ కారణంగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇరా.. ఆమిర్‌- అతడి మొదటి భార్య రీనా దత్తాల మలి సంతానం. ఆమె ప్రస్తుతం తన అన్న జునైద్‌ ఖాన్‌, తల్లి రీనాలతో కలిసి జీవిస్తున్నారు.


 

I just wanna dance with you💃🏻 @mishaalkirpalani 🎤 @princetonugoeze11 . . . #dance #slowdance #thirdwheel #love #squishies #karaoke

A post shared by Ira Khan (@khan.ira) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా