ఆమిర్కు జోడిగా తొలిసారి..!

4 Sep, 2017 13:03 IST|Sakshi
ఆమిర్కు జోడిగా తొలిసారి..!

హాలీవుడ్ లో సత్తా చాటుతున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఓ ప్రస్టిజియస్ ప్రాజెక్ట్ లో నటించనున్నారు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బయోపిక్ లో పీసీ లీడ్ రోల్ లో నటించనున్నారు. ఆమిర్ ఖాన్ త్వరలో భార‌త వ్యోమ‌గామి రాకేశ్ శ‌ర్మ జీవిత క‌థ‌తో తెరకెక్కుతున్న 'శాల్యూట్‌'  సినిమాలో నటించనున్నారు.

ఈ సినిమాలో రాకేశ్ భార్య పాత్రలో ప్రియాంక చోప్రా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రకు 'దంగ‌ల్‌' సినిమాలో నటించిన  ఫాతిమా షేక్ స‌నాను ఫైనల్ చేశారు. ఇప్పుడు మరో కీలక పాత్రకు ప్రియాంక చోప్రా పేరును పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ చేయలేక సంజయ్ లీలా భన్సాలీ గుస్తాకియాన్ సినిమాను వదులుకున్న పీసీ.. ఆమిర్ సినిమాకు ఓకె చెపుతుందో లేదో చూడాలి.