నాలుగు నెలలు...పదిహేను కేజీలు!

5 Jun, 2016 22:54 IST|Sakshi
నాలుగు నెలలు...పదిహేను కేజీలు!

‘బంచిక్ బంచిక్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా....’ అంటూ సన్నబడాలనుకునేవాళ్లు యోగా చేసి చిక్కుతారు. లావవ్వాలంటే.. కండలు పెరగాలంటే మాత్రం జిమ్ చేయాలి. కడుపు నిండా తినాలి. ఆ మధ్య ఆమిర్‌ఖాన్ అదే చేశారు. మల్లయోధునిగా ఆమిర్ నటిస్తున్న చిత్రం ‘దంగల్’. ఈ  సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగారు ఆమిర్. సినిమా మొత్తం ఈ వెయిట్‌తో కనిపించరు. చిక్కిన ఆమిర్ కూడా కనిపిస్తారు. అందుకే ముందు పెరిగి, ఆ సీన్స్ తీశాక తగ్గారు. ఇంతకీ ఈ హీరోగారు ఎలా బరువు తగ్గారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

జస్ట్ రన్నింగ్‌తోనే 15 కేజీలు తగ్గారట. నాలుగు నెలల్లో రోజుకు 7 నుంచి 9 కిలోమీటర్ల చొప్పున పరిగెత్తారట. అంటే.. మొత్తం వెయ్యి కిలోమీటర్ల పైనే. రన్నింగ్‌తో పాటు స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అయ్యారు. దాంతో నాలుగు నెలల క్రితం ఆమిర్‌ని చూసినవాళ్లు ఇప్పుడు చూసి, ‘ఔరా’ అనకుండా ఉండలేకపోతున్నారు.

>