తారే చైనా పర్‌

19 May, 2019 04:29 IST|Sakshi
తారే జమీన్‌ పర్‌ పోస్టర్‌

తారే జమీన్‌ పర్‌. 2007లో రిలీజైన ఆమిర్‌ ఖాన్‌ చిత్రం. అంతేనా... ఆమిర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం. అంతేనా... 2007లో ఆస్కార్‌ రేస్‌లో పోటీ పడిన చిత్రం. తల్లిదండ్రుల కోసం తీసిన పిల్లల చుట్టూ తిరిగే కథ ఇది. ఆలస్యమైనా చెప్పాల్సిన కథ వెళ్లాల్సిన చోటుకు వెళ్తుందటారు. ‘తారే జమీన్‌ పర్‌’ సినిమా పన్నెండేళ్ల తర్వాత చైనీస్‌ భాషలో రీమేక్‌ కాబోతోంది.

చైనాలో ఆమిర్‌ ఖాన్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ‘పీకే, దంగల్‌’ రికార్డ్‌ స్థాయి కలెక్షన్స్‌ నమోదు చేశాయి. మరి.. ఎంచక్కా డబ్బింగ్‌ చేసుకునేదానికి ఎందుకీ రీమేక్‌ అంటే.. రెండేళ్లు పైబడిన సినిమాల రిలీజ్‌ చైనాలో నిషేదం. దాంతో చైనీస్‌ లోకల్‌ స్టార్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రీమేక్‌ చేస్తున్నారు. మా డ్యుయో ఈ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారు. విశేషమేటంటే చైనాలో పైరసీలో ఎక్కువ శాతం మంది వీక్షించిన చిత్రం కూడా ‘తారే జమీన్‌ పర్‌’ చిత్రమే.
 

మరిన్ని వార్తలు