పిల్ల‌లను చూసి ఆ మూడు నేర్చుకోండి: న‌టుడు

24 Apr, 2020 12:58 IST|Sakshi

లాక్‌డౌన్‌ వ‌ల్ల పొద్ద‌స్త‌మానం ఇంట్లోనే ఉండ‌టంతో నేర్చుకోడానికి ఎంతో స‌మ‌యం దొరుకుతోంది. బాలీవుడ్ న‌టుడు ఆయుష్మాన్ శ‌ర్మ కూడా ప్ర‌స్తుతం ఎంతో నేర్చుకుంటున్నాడంటున్నాడు. అది కూడా త‌న పిల్ల‌లు నేర్పిస్తున్నార‌ని చెప్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ను త‌న కుటుంబంతో క‌లిసి స‌ల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు. పిల్ల‌ల‌తో గ‌డుపుతూ కాలాన్ని వీలైనంత స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఎప్పుడూ చిరున‌వ్వును చెర‌గ‌నివ్వ‌ని పాల బుగ్గ‌ల పిల్ల‌లు త‌న‌కో విష‌యం నేర్పించాడ‌ని చెబుతున్నాడు. త‌న‌కే కాదు.. ప్ర‌తీ పిల్ల‌వాడు పెద్ద‌ల‌కు మూడు విష‌యాల‌ను బోధిస్తున్నాడ‌ని పేర్కొన్నాడు. మొద‌టిది.. ఏ కార‌ణం లేకుండానే సంతోషంగా ఉండ‌టం, రెండోది ఎల్ల‌ప్పుడూ ఉత్సుక‌త ప్ర‌ద‌ర్శించడం, ముచ్చ‌ట‌గా మూడోది నిర్విరామంగా పోరాడ‌టం.. అని చెబుతూ త‌న పిల్ల‌లు అహిల్‌, అయాత్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా పంచుకు‌న్నాడు. (అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? )

కాగా ఆయుష్.. కండలవీరుడు స‌ల్మాన్ ఖాన్ చిన్న సోద‌రి అర్పితాఖాన్‌ను 2014లో హైద‌రాబాద్‌లోని ఫ‌లక్‌నుమా ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి అహిల్, అయాత్ అనే పిల్ల‌లున్నారు. ఇక స‌ల్మాన్ ఖాన్ పుట్టిన‌రోజైన డిసెబ‌ర్ 27 నాడే అయాత్ జ‌న్మించ‌డం విశేషం. గ‌తంలోనూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో దిగిన ప‌లు ఫొటోల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అంద‌రూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో ఎన్నో జ్ఞాప‌కాల‌ను గూడు క‌ట్టుకోండ‌ని సూచించాడు. ఇదిలావుండ‌గా ఆయుష్ శ‌ర్మ "క్వ‌త" చిత్రంలో క‌నిపించ‌నున్నాడు. ఇందులో హీరోయిన్‌ క‌త్రినా కైఫ్ సోద‌రి ఇసాబెల్లి కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. (నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి)

A child can teach an Adult 3 things - To he happy for no reason - To always be curious - To fight tirelessly for something Paulo Coelho

A post shared by Aayush Sharma (@aaysharma) on

మరిన్ని వార్తలు