'ఓ మై గాడ్' చిత్రంతో సంచలన విజయాలను నమోదుచేసుకున్న ఉమేష్ శుక్లా దర్శకత్వంలో రూపొందుతున్న 'మేరే అప్నే' చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తుండగా, అసిన్ ఆయన సరసన హీరోయిన్గా చేస్తోంది. ''ఈరోజు మరో ప్రయాణం మొదలైంది. తొలిరోజు మాత్రం చాలా నెర్వస్‌గా అనిపించింది. కొత్త సాయంత్రం, కొత్త రోజు, కొత్త సినిమా. నాకు మీరు కొంత ప్రేమను పంచండి" అంటూ ట్విట్టర్లో అభిషేక్ పోస్ట్ చేశాడు.
Today starts yet another journey. First day jitters always get to me. New dawn, new day, new film. Crew…. Send some love!
— Abhishek Bachchan (@juniorbachchan) October 18, 2013
ఈ సినిమాలో అభిషేక్ తండ్రి పాత్రను సీనియర్ నటుడు రిషి కపూర్ పోషిస్తున్నాడు. చిత్ర నిర్మాత భూషణ్ కుమార్. 2012లో బోల్ బచ్చన్ తర్వాత అభిషేక్ మళ్లీ బాలీవుడ్ తెరమీద కనిపించలేదు. ధూమ్ 3 సినిమాలో మళ్లీ ఇంతకుముందులాగే ఏసీపీ జై దీక్షిత్ పాత్రనే పోషిస్తున్నాడు. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఉదయ్ చోప్రా కూడా నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇక 'మేరే అప్నే'తో పాటు ఫరాఖాన్ తీస్తున్న 'హేపీ న్యూ ఇయర్' చిత్రంలోను, కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'దోస్తానా 2' లో కూడా అభిషేక్ నటిస్తున్నాడు.