హోలీ అంటే చిరాకు

2 Mar, 2018 00:47 IST|Sakshi
కరణ్‌ జోహార్‌

కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌ అగ్ర దర్శక– నిర్మాత. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ తెరనిండా నటీనటులతో కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ కర ణ్‌కు మాత్రం కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ ‘హోలీ’ అంటే చిరాకట. ఇంకో విశేషం ఏంటంటే దానికి కారణం అభిషేక్‌ బచ్చన్‌ అట. ఎందుకలా? అని అడిగితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు కరణ్‌.  ‘‘నా 7ఏళ్ల వయసప్పుడు అనుకుంటా.. ఓసారి హోలీకి మా వీధిలోని పిల్లలందరూ కలిసి నాకు రంగులు పూయటానికి వచ్చారు.

ఆ రంగులు అంటకుండా ఉండటం కోసం వాళ్లకు దొరక్కుండా పరిగెత్తే ప్రయత్నంలో కిందపడిపోయాను. దెబ్బలు తగిలాయి. దాంతో వాళ్లతో గొడవ పడ్డాను. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ హోలీ రోజు అమితాబ్‌ బచ్చన్‌వాళ్ల ఇంటికి వెళ్లాను. నాకు హోలీ అంటే ఎందుకు భయమో అమిత్‌జీతో చెబుతున్నప్పుడు మా సంభాషణంతా వెనుక నుంచి అభిషేక్‌ బచ్చన్‌ విన్నాడు. మొత్తం విన్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అమాంతం ఎత్తుకొని రంగులున్న వాటర్‌ పూల్‌లో పడేశాడు. అంతే... అక్కడితో నాకు హోలీ అంటే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఎప్పూడు హోలీ ఆడలేదు’’ అని పేర్కొన్నారు కరణ్‌.

మరిన్ని వార్తలు