ఇక చాలు.. అడ్డు తప్పుకోండి!

13 Dec, 2019 14:48 IST|Sakshi

బీ టౌన్‌ స్టార్‌ కిడ్స్‌‌ అబ్‌రామ్‌ ఖాన్‌, తైమూర్‌ అలీఖాన్, ఆరాధ్య బచ్చన్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ఫొటోలు షేర్‌ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు. ఇక పేరెంట్స్‌తో కలిసి బుల్లి స్టార్స్‌ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌- గౌరీఖాన్‌ల ముద్దుల తనయుడు అబ్‌రామ్‌ ఖాన్‌(6)కు విసుగు తెప్పించింది. తమ కారు వెళ్లకుండా అడ్డుకుంటూ.. తనపై ఫ్లాష్‌ల వర్షం కురిపిస్తున్న ఫొటోగ్రాఫర్లపై అబ్‌రాం అసహనం వ్యక్తం చేశాడు. కారుకు అడ్డుతప్పుకోవాలని చేతులతో సైగలు చేస్తూ.. తన ముఖాన్ని దాచుకున్నాడు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో.. ‘చిన్నారిని తన బాల్యం ఎంజాయ్‌ చేయనివ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌ బడా నిర్మాత ఆదిత్య చోప్రా- నటి రాణీ ముఖర్జీల గారాలపట్టి ఆదిరా పుట్టినరోజు సందర్భంగా.. పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో అబ్‌రాం ఇలా అసహానికి లోనయ్యాడు. ఈ పార్టీలో అబ్‌రాంతో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు కూడా సందడి చేశారు. ఇక అబ్‌రాం ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబై ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్లకు చిక్కకుండా తన బొమ్మను అడ్డుపెట్టుకున్నాడు. అదే విధంగా మరో ఈవెంట్లో సైతం తన ఫొటోలు తీయొద్దంటూ కెమెరామెన్లను హెచ్చరించాడు.

#AbramKhan #shahrukhkhan #ranimukerji #Srk #srkabram #Shahrukh

A post shared by Entertainment Fan Page (@facc2911) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా