రాజమండ్రి ప్రయాణం

11 Feb, 2020 04:01 IST|Sakshi
చిరంజీవి

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తు న్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఈ నెల 24న రాజమండ్రి ప్రయాణం కానున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజమండ్రిలో ఓ కీలక షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారట చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్‌ ఎపిసోడ్‌లు, కీలక సన్నివేశాలు ప్లాన్‌ చేశారని టాక్‌. ఈ షెడ్యూల్‌లోనే త్రిష షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఆల్రెడీ ఒక పాట కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించేశారు. 80–90 రోజుల మధ్యలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, ఆగస్ట్‌లో విడుదల చేయాలను కుంటున్నారట.

మరిన్ని వార్తలు