మళ్లీ శాకాహారం

20 Nov, 2019 00:36 IST|Sakshi

వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత,  దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్‌ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్‌’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్‌’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా

సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

బిగ్‌బాస్‌లో ముద్దుల గోల

సమస్యను పరిష్కరించే రాజా

బ్రేకప్‌ గురించి మాట్లాడను

ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు

నా పేరు లాల్‌

కపటధారి

బర్త్‌డే సర్‌ప్రైజ్‌

ఉదయం ఆట ఉచితం

మూడేళ్ల కష్టం

కాంబినేషన్‌ కుదిరేనా?

రీమేక్‌ కోసం కలిశారు

కన్నడనూ కబ్జా చేస్తారా?

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

కొత్త నిర్మాతలకు తరగతులు

నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్‌, విజయ్‌ల సందడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’