రుద్రవీణ చూసి ఇండస్ట్రీకి వచ్చా

15 Nov, 2019 05:05 IST|Sakshi
శ్రీనివాస్‌ ఆడెపు

విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్‌’. తమన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీ కార్తికేయ సినిమాస్‌ పతాకంపై శ్రీనివాస్‌ ఆడెపు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నేడు విడుదలవుతోన్న ఈ సినిమా గురించి శ్రీనివాస్‌ ఆడెపు విలేకరులతో మాట్లాడుతూ...

► సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసి డైరెక్టర్‌ అవుదామని ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. ‘హుషారు, ఇస్మార్ట్‌ శంకర్, గద్దలకొండ గణేష్, రాజుగారిగది 3’ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను.  నేను నిర్మాతగా మా బ్యానర్‌లో విడుదల అవుతున్న తొలి చిత్రం ‘యాక్షన్‌’. 600 థియేటర్స్‌లో విడుదలవుతోంది. భవిష్యత్‌లో డైరెక్షన్‌ చేస్తాను. ఇండస్ట్రీలో నిర్మాతగానే కాదు.. డిస్ట్రిబ్యూటర్‌గా ఉండటం కూడా కష్టమే.. దేని పోరాటం దానిదే.

► ‘యాక్షన్‌’ టీజర్‌ చూడగానే ఎగై్జటింగ్‌గా అనిపించి హక్కులు కొన్నాను. విశాల్‌ అభిమానులకు ఈ సినిమా ఒక విజువల్‌ ట్రీట్‌లా ఉంటుంది.   ఈ సినిమా సుందర్‌ సి. గారి దర్శకత్వ శైలికి భిన్నంగా ఉంటుంది. తమన్నాకు ఈ సినిమాతో మరింత మంచి పేరు వస్తుంది. రానాగారితో ర్యాప్‌ పాడించాలనే ఆలోచన విశాల్‌తో కలిసి నేనూ ఆలోచించినదే. వ్యక్తిగతంగా నాకు భావోద్వేగ చిత్రాలంటే ఇష్టం. ‘రుద్రవీణ’ సినిమా చూసి ఇండస్ట్రీకి వచ్చాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా