గాయాలకు లొంగడు!

1 Jun, 2017 01:39 IST|Sakshi
గాయాలకు లొంగడు!

గన్స్‌తో గేమ్స్‌ ఆడేవాడు గాయాలకు లొంగడు. అందులోనూ ‘ నెవర్‌ ఎవర్‌ గివప్‌’ లాంటి మైండ్‌సెట్‌ ఉన్నోడైతే టార్గెట్‌ను రీచ్‌ అయ్యేంతవరకు కాంప్రమైజ్‌ అవ్వడు. హీరో అజిత్‌ ఈ ట్రాక్‌లోనే  దూసుకెళ్తున్నారు. దెబ్బ తగిలినా లెక్క చేయరు. ఇప్పటివరకూ ఎన్నో షూటింగుల్లో అజిత్‌ గాయాలపాలయ్యారు.

అయినా రిస్కీ ఫైట్స్‌ మానరు. తాజాగా ‘వివేగమ్‌’ సినిమా సెట్స్‌లో అజిత్‌ గాయపడ్డారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన భుజానికి గాయం అయ్యిందట. షూటింగ్‌ క్యాన్సిల్‌ చేద్దామన్నా ఒప్పుకోకుండా, ఫస్ట్‌ ఎయిడ్‌ తీసుకుని, కొంత సమయం తర్వాత మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారట. అజిత్‌తో ‘వీరమ్‌’, ‘వేదాలం’ వంటి హిట్‌ చిత్రాలను అందించిన శివ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్‌ యాక్టర్లు వివేక్‌ ఒబెరాయ్, అరవ్‌ చౌదరి విలన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. కాజల్‌ అగర్వాల్, అక్షరాహాసన్‌ కథానాయికలు. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరకర్త.

>