‘బాగా దగ్గరిగా బతికిన రోజుల్లో..’

11 May, 2020 08:42 IST|Sakshi

లాక్‌డౌన్‌తో దాదాపు 50 రోజులుగా సినీపరిశ్రమకు చెందిన వారు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసినా, కరోనా ప్రభావం తగ్గకపోవడంతో ఒకప్పటిలా కలివిడిగా ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది. ఇంకా లాక్‌డౌన్‌ సడలింపు నిబంధనలు సినీ ఇండస్ట్రీకి వర్తించకపోవడంతో సినీ నటులు ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఈ క్రమంలోనే బాగా దగ్గరిగా బతికిన రోజుల్లో అంటూ సినీ పరిశ్రమకిచెందిన వారితో దిగిన ఫోటోలను సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ ట్వీట్ చేశాడు.హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు, డైరెక్టర్లు హరీశ్‌ శంకర్‌, మెహర్‌ రమేష్‌, బీవీఎస్‌ రవిలతో సరదాగా గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు. అతికిన రోజుల్లో అంటూ నటులు పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అలీ, నర్రా శ్రీనివాస్‌, నిర్మాత శరత్‌ మరార్‌లతో కలిసి దిగిన ఫోటోను బ్రహ్మాజీ పోస్ట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు