చైతన్యకృష్ణ హీరోగా నిర్మిస్తోన్న చిత్రం ‘కాళీచరణ్’

29 Jun, 2013 05:23 IST|Sakshi
చైతన్యకృష్ణ హీరోగా నిర్మిస్తోన్న చిత్రం ‘కాళీచరణ్’
‘‘యధార్థ సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. 1980ల్లో జరిగిన ఓ వాస్తవిక నేపథ్యంలో ‘కాళీచరణ్’ని తీర్చిదిద్దాం. కథాకథనాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉంటాయి’’ అని శ్రీప్రవీణ్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో శ్రీ కరుణాలయం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ‘కాళీచరణ్’. చైతన్యకృష్ణ, చాందిని ఇందులో హీరో హీరోయిన్లు. 
 
 తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పంకజ్ కేసరి, కవితా శ్రీనివాసన్, నాగినీడు, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నందన్‌రాజ్, కెమెరా: విశ్వ దేవబత్తుల, సతీష్ ముత్యాల, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎమ్.ఎన్.ఎస్.రాయుడు.