భర్త రాజీవ్‌ వ్యాఖ్యలను ఖండించిన నటి

14 Jul, 2020 16:12 IST|Sakshi

ముంబై: తనని ఎవరూ ప్రభావితం చేయలేదని.. రాజీవ్‌తో విడిపోవాలని తనే నిర్ణయించుకున్నానంటూ నటి చారు అసోపా తన భర్త రాజీవ్ సేన్‌ వ్యాఖ్యలను ఖండించారు. సుష్మితా  సేన్‌ సోదరుడైన రాజీవ్‌ సేన్‌-చారు అసోపాల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ వార్తలపై రాజీవ్ స్పందిస్తూ.. తన భార్య అమాయకురాలని, చారు స్నేహితులే ఆమెను ప్రభావితం చేసుంటారని ఆరోపించాడు. దీంతో రాజీవ్‌ వ్యాఖ్యలపై చారు స్పందిస్తూ... ‘నాకు ఎవరూ బ్రెయిన్‌ వాష్‌ చేయలేదు. ఇది నా సొంతంగా తీసుకున్న నిర్ణయం. నా జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకునేంత పరిపక్వత నాకు ఉంది. బహుశా రాజీవ్‌నే తన స్నేహితులు ప్రభావితం చేసుంటారు. అందువల్లే తన సోషల్‌ మీడియా ఖాతాలో మా ఫొటోలు డిలీట్‌ చేశాడు’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అంతేగాక తమ వివాహ వార్షికోత్సానికి కొన్నిరోజుల ముందు రాజీవ్‌ ముంబైలోని తమ నివాసాన్ని వదిలి ఢిల్లీ ఇంటికి వెళ్లిపోయాడని ఆమె ఆరోపించారు.

(చదవండి: విడాకులపై స్పందించిన సుష్మితా సేన్‌ సోదరుడు)

‘‘మా మొదటి వివాహవార్సికోత్సవానికి కొన్ని రోజుల ముందు రాజీవ్‌ నన్ను ముంబైలోని ఇంటిలో ఒంటరిగా వదిలి న్యూఢిల్లీలోని ఇంటికి వెల్లిపోయాడు. సరే నేను అమాయకురాలిని, నా చూట్టు ఉన్నవారు నన్ను ప్రభావితం చేస్తారని రాజీవ్‌ భావించినప్పుడు ఎందుకు నన్ను ఆ సమయంలో వదిలి బయటకు వెళ్లిపోయాడు. అది మా మొదటి వివాహ వార్షికోత్సవం. అది మాకెంతో ప్రత్యేకమైనది ఆ సమయంలో భార్యభర్తలుగా మేమిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయం. కానీ రాజీవ్‌ నన్ను ఒంటరిగా వదిలి వేరే ఇంటికి వెళ్లిపోయాడు. అతడు ఎందుకు అలా చేశాడు’’ అని ఆమె ప్రశ్నించారు. గతేడాది రాజీవ్‌ సెన్‌- చారు అపోసాలు గోవాలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారి పెళ్లైనప్పటి నుంచి ఈ జంట వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఇటీవల వారిద్దరూ సోషల్‌ మీడియాలో తమ ఖాతాలోని ఒకరి ఫొటోలు ఒకరూ డిలీట్‌ చేసుకోవడంతో ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చాయి. 

(చదవండి: వారిద్దరు విడిపోయారా?!)

మరిన్ని వార్తలు