ఏజెంట్‌పై ప్రతీకారం తీర్చుకున్న హాలీవుడ్‌ నటుడు

21 May, 2020 12:35 IST|Sakshi

బలవంతంగా అపార్టుమెంట్‌ ఖాళీ చేయించిన ఏజెంట్‌పై కోపంతో టీవీ నటుడు శాండీ బాట్చెలర్‌ వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇటీవల పర్యటనకు వెళ్లిన శాండీ అక్కడ ఏజెంట్‌ ద్వారా ఒక ఫ్లాటు అద్దెకు తీసుకున్నాడు. అదే ఫ్లాటులో మరొకరు అద్దెకు వస్తుండంతో ఏజెంట్‌ శాండీని ఖాళీ చేయమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ ఫ్లాటుపై తన రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో శాండీ దానిలో లోపాలను ఎత్తిచూపుతూ వీడియో తీసి మంగళవారం తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘మా లెట్టింగ్ ఏజెంట్‌ నన్ను బలవంతగా ఫ్లాటు నుంచి ఖాళీ చేయిస్తూ ఆ గది గురించిన అనుభవాలను వీడియో ద్వారా పంచుకోవాలని కోరాడు. కొత్తగా అద్దెకు వచ్చేవారికి, ఏజెంట్‌కు నా శుభకాంక్షలు’ అంటూ శాండీ ట్వీట్‌ చేశాడు. (దెబ్బ‌కు టిక్‌టాక్‌కు దిమ్మ‌తిరిగిపోయింది)

ఆ వీడియోకు ఇప్పటివరకు 7 మిలియన్‌ల వ్యూస్‌, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇక ఆ ఏజెంట్‌ మీద కోపంతో ఫన్నీగా ప్రతీకారం తీర్చుకున్న శాండీని కొంతమంది నెటిజన్లు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు. ‘‘మీరు కావాలనే ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఇలా చేస్తే ఫ్లాటులో మళ్లీ తనే ఉండొచ్చనే స్వార్థంతో ఇలా చేశాడు’’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో శాండీ ‘‘ఇది లివింగ్‌ రూం. ఈ ఫ్లోర్‌ ఎంత మురికిగా ఉందో చూడండి. అంతేగాక కిటికీపై ఉన్న దుమ్ము చూడండి. ఇంకా ఎవరో మద్యం తాగి ఇక్కడే ఆ సిసాలను వదిలేస్తే దానిని ఇంతవరకు శుభ్రం చేయలేదు. ఇక ఇది చూస్తే మీకు కచ్చితంగా ఆసహ్యించుకుంటారు. ఇక్కడ చూడండి తడి దుస్తులను అలాగే వదిలేశారు. వాటి నుంచి చెడు వాసన గుప్పుమంటుంది’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. అంతేగాక గది బయట చెల్లాచెదురుగా పడి ఉన్న కొన్ని డబ్బాలను చూపిస్తూ ఎంత ఆసహ్యంగా ఉందో చుశారా. అదే విధంగా ఇంకాస్తా బయటకు చూపిస్తూ ఈ చూట్టుపక్కల దయ్యాలు కూడా ఉండొచ్చు’’ అని హెచ్చరించాడు. (సూపర్‌ పవర్స్‌ చిన్నారి, వీడియో వైరల్‌!)

>
మరిన్ని వార్తలు