బాలీవుడ్‌ను వదలని కరోనా..

24 May, 2020 08:24 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ను కరోనా వైరస్‌ వదలడం లేదు. ఇప్పటికే సింగర్‌ కనికా కపూర్‌, నిర్మాత కరీం మోరాని, ఆయన కూతుళ్లు, నిర్మాత బోని కపూర్‌ ఇంట్లో సహాయకులు.. ఇలా పలువురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా నటుడు కిరణ్‌ కుమార్‌ తనకు కరోనా సోకినట్టు వెల్లడించారు. దీంతో మే 14 నుంచి  హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలిపారు. కాగా, 74 ఏళ్ల కిరణ్‌ పలు బాలీవుడ్‌ చిత్రాలతో పాటు.. సీరియల్స్‌లో కూడా నటించారు. (చదవండి : ‘సెలబ్రిటీ హోదా’ అనేది ఒక అదృష్టం)

‘వైరస్‌ లక్షణాలు లేకపోయినా.. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నాకు జ్వరం, దగ్గు.. వంటివి కూడా లేవు. నేను బాగానే ఉన్నాను.. అందుకే హోం క్వారంటైన్‌ అయ్యాను. కరోనా నిర్ధారణ అయి 10 రోజులు అయినప్పటికీ నాలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇంట్లోని రెండో ఫ్లోర్‌లో నా కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. నేను మూడో ఫ్లోర్‌లో ఒంటరిగా ఉంటున్నారు. ఇది నా బోర్డింగ్‌ స్కూల్‌ రోజులను గుర్తుచేస్తుంది. మే 26 లేదా మే 27న నాకు రెండో సారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను’ అని కిరణ్‌ తెలిపారు.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు