తమిళంలోకి తొలి అడుగు

6 Mar, 2018 01:17 IST|Sakshi
మెహరీన్‌, విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ తమిళ పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ‘ఇంకొక్కడు’ ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెలుగు, తమిళ భాషల్లో విజయ్‌ దేవరకొండ, మెహరీన్‌ జంటగా కె.ఇ.జ్ఞానవేల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌నివ్వగా, ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ వంగా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘జ్ఞానవేల్‌ రాజాగారి బ్యానర్‌లో సినిమా చేయడం ప్రౌడ్‌గా ఫీల్‌ అవుతున్నాను.

కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించింది. డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి మరీ ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు. ‘‘అర్జున్‌ రెడ్డి’ని 5సార్లు థియేటర్‌లో చూశాను. విజయ్‌ అద్భుతమైన నటుడు. మా బ్యానర్‌లో డైరెక్ట్‌ తెలుగు ఫిల్మ్‌లో విజయ్‌ హీరోగా నటిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఆనంద్‌ శంకర్, సంగీత దర్శకుడు శామ్‌.సి, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిర ణ్‌ ఇలా పెద్ద సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. మార్చి 8న హైదరాబాద్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అన్నారు జ్ఞానవేల్‌ రాజా.

‘‘అర్జున్‌ రెడ్డి’ బాగా నచ్చింది. విజయ్‌ బాగా యాక్ట్‌ చేశాడు. నేను చెప్పిన కథ విని బాగా ఎగై్జట్‌ అయ్యాడు. తమిళం నేర్చుకుని మరీ డైలాగ్స్‌ చెబుతా అన్నాడు. అంత ప్యాషనేట్‌ యాక్టర్‌’’ అన్నారు ఆనంద్‌ శంకర్‌. ‘‘ఇటీవల విజయ్‌తో హోలీ సాంగ్‌ చేశాను. వెంటనే ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా చేస్తున్నాను. స్క్రిప్ట్‌ విని ఎగై్జట్‌ అయ్యాను. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో యాక్ట్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మెహరీన్‌. కేయస్‌ రామారావు, బీవీయస్‌యన్‌ ప్రసాద్, వంశీ పైడిపల్లి, స్వప్నా దత్, నవీన్‌ ఎర్నేని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు