ఫస్ట్‌ హీరోతో 34 ఏళ్ల తర్వాత!

11 Feb, 2018 01:16 IST|Sakshi
నదియా

ఒకటి కాదు... రెండు కాదు.. 34 ఏళ్లు పట్టింది మోహన్‌లాల్, నదియా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి. మోహన్‌లాల్‌ హీరోగా ఆల్మోస్ట్‌ 34 ఏళ్ల క్రితం ‘నోక్కెద దూరత్తు కన్నుమ్‌ నాట్టు’ సినిమాతోనే మాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు నదియా. ఆ తర్వాత తన తొలి హీరో మోహన్‌లాల్‌ సరసన ఆమె నటించలేదు. నిజానికి మాతృభాష మలయాళంలోకన్నా తమిళంలోనే నదియా ఎక్కువ సినిమాలు చేశారు.

తమిళ చిత్రం ‘ఎం కుమరన్‌ సన్నాఫ్‌ మహాలక్ష్మి’తో క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా మారి, వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న నదియా ‘మిర్చి’తో తెలుగులో మోస్ట్‌ వాంటెడ్‌ వదిన, అమ్మ అయ్యారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు తన తొలి హీరో మోహన్‌లాల్‌తో ఆమె ‘నీరలి’ అనే  సినిమా చేయనున్నారు. అయితే జంటగా కాదని సమాచారం. ఓ కీలక పాత్రకు నదియాను తీసుకున్నారట. ఈ చిత్రంలో పార్వతీ నాయర్‌ కథానాయికగా నటిస్తున్నారు. అజయ్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మోహన్‌లాల్‌ స్లిమ్‌ లుక్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు.

మరిన్ని వార్తలు