నాని కూడా ఆ లిస్ట్లో చేరబోతున్నాడు..!

19 Nov, 2016 12:43 IST|Sakshi
నాని కూడా ఆ లిస్ట్లో చేరబోతున్నాడు..!

హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్లో కూడా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో ఉన్న ఈ హీరో పర్సనల్ లైఫ్లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ తీసుకుంటున్నాడు.

ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్లో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.