అర్జున్‌.. అను వచ్చేశారు

30 Mar, 2020 04:03 IST|Sakshi
కీర్తీ సురేశ్‌, నితిన్‌

‘భీష్మ’ వంటి హిట్‌ చిత్రం తర్వాత నితిన్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్‌ దే’. కీర్తీ సురేశ్‌ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్‌ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

పుట్టినరోజు వేడుకల్లేవ్‌.. పెళ్లి వాయిదా
కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్‌ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు.
∙కీర్తీ సురేశ్, నితిన్‌

మరిన్ని వార్తలు