సిద్దార్థ్ నాకు మంచి మిత్రుడు మాత్రమే!

2 Jul, 2013 03:17 IST|Sakshi
సిద్దార్థ్ నాకు మంచి మిత్రుడు మాత్రమే!
 సిద్దార్థ్, సమంత మధ్య ప్రేమాయణం నడుస్తోందని, త్వరలో వారిద్దరూ పెళ్లాడబోతున్నారని గత కొంతకాలంలో మీడియాలో గాసిప్పులు హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఎట్టకేలకు తమపై వస్తున్న గాసిప్పులపై సమంత వివరణ ఇచ్చారు. సిద్దార్థ్ తనకు మంచి మిత్రుడని, అంతకు మించి తామిద్దరి మధ్య ఇంకేమీ లేదని సమంత స్పష్టం చేశారు.
 
  ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని, ఈ గాసిప్పుల వల్ల తన నిర్మా తలు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నానని ఈ సందర్భంగా సమంత చెప్పారు. ఇంకా సమంత చెబుతూ-‘‘మా వ్యక్తిగత విషయాలపై మీడియా అత్యుత్సాహం చూపించడం చాలా బాధాకరం. దాచుకోవాల్సినంత రహస్యమైన విషయాలేమీ నా దగ్గర ఉండవు. ప్రేమ, పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనవి. 
 
 నా విషయంలో ఏది జరిగినా అమ్మానాన్నల ప్రమేయంతోనే జరుగుతుంది’’ అని చెప్పారు సమంత. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయని, తన ఆలోచనలు మొత్తం పాత్రల చుట్టూనే తిరుగుతున్నాయని సమంత అన్నారు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి