రహస్యం ఏంటో?

14 Jan, 2019 02:53 IST|Sakshi
శ్రీ రితిక

సాగర్‌ శైలేష్, శ్రీ రితిక జంటగా సాగర శైలేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రహస్యం’. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్‌ పోస్టర్‌ను  శ్రీకాంత్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణగారు మంచి నిర్మాత. మంచి ప్లానింగ్‌తో సినిమాని విడుదల చేస్తారు. ‘రహస్యం’ ట్రైలర్‌ చాలా బాగుంది.

సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు.‘‘వైవిధ్యమైన కథతో రూపొందిన చిత్రమిది. ‘రహస్యం’ టైటిల్‌ ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలి. సాగర్‌ శైలేష్‌ ప్రాణం పణంగా పెట్టి తీశారు. దర్శకులు రామ్‌గోపాల్‌ వర్మ, పూరి జగన్నాధ్, మారుతి, నిర్మాత రాజ్‌ కందుకూరిగార్లు విడుదల చేసిన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు రామసత్యనారాయణ.

మరిన్ని వార్తలు