కాపాడమని లాయర్‌ దగ్గరకు వెళ్తే..

4 Jan, 2020 11:40 IST|Sakshi

బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి తెరలేపిన నటి తనుశ్రీ దత్తా. చిత్ర పరిశ్రమలో ఈ ఉద్యమం పెను దుమారాన్నే సృష్టించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఈ ముద్దగుమ్మ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి. అయితే తను శ్రీ ఆరోపణలను ఖండిస్తూ నానా పటేకర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసులో తనుశ్రీ తన  తరుఫున వాదించేందుకు నితిన్ స‌త్పుటే అనే ఓ లాయ‌ర్‌ను నియమించుకుంది. (మా అక్కలా.. నాకెప్పుడూ జరుగలేదు’)

స‌ద‌రు లాయ‌ర్ నితిన్ స‌త్పుటే కూడా కామాంధుడేన‌ట‌. ఇటీవ‌ల‌ లాయ‌ర్ నితిన్‌పై ఓ మహిళా లాయ‌ర్ కేసు న‌మోదు చేసింది. ఓ భూవివాదానికి సంబంధించిన కేసులో కాంప్ర‌మైజ్ చేసేందుకు నితిన్‌.. ప్రత్యర్థి మ‌హిళా లాయ‌ర్‌‌తో క‌లిసి మాట్లాడాడ‌ట‌. ఆ స‌మ‌యంలో త‌న ప‌ట్ల నితిన్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని మ‌హిళా న్యాయవ్యాది కేసు పెట్టింది. త‌న‌నేదో ర‌క్షిస్తాడ‌ని ఓ లాయ‌ర్‌ను పెట్టుకుంటే ఆయన కూడా కామాంధుడేనని కేసు ప‌డింది. దీంతో తనుశ్రీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. (ఇన్‌స్పిరేషన్‌ #తనూటూ..!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా