ముహూర్తం కుదిరింది

10 Feb, 2014 04:04 IST|Sakshi
ముహూర్తం కుదిరింది
తమిళ సినిమా, న్యూస్‌లైన్: నటి నజ్రియా వివాహ నిశ్చితార్థం శనివారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలోని తాజ్ హోటల్‌లో జరిగింది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ భామ నజ్రియా నజీమ్. ఆ మధ్య నయ్యాండి చిత్రంలో తన పొట్ట చూపించారంటూ నానా రభస చేసిన ఈ బ్యూటీ రాజారాణి, తదితర చిత్రాల్లో నటించింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ కొడుకు, నటుడు పాహత్ పాజిల్‌తో ప్రేమ పెళ్లికి బాటలు వేసింది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఆగస్టు 21న తిరువనంతపురంలోని కళాకూట్టం అల్‌తాజ్ హాల్‌లో జరగనుంది. ఆ తర్వాత 24న వివాహ రిసెప్షన్ జరగనుంది. వివాహానంతరం తన భర్త, తల్లిదండ్రుల అనుమతితో నటనను కొనసాగిస్తానని నజ్రియా స్పష్టం చేసింది.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి