ఆ దర్శకుడు లైంగికంగా వేధించాడు: గీతిక

20 Feb, 2014 15:50 IST|Sakshi

జాలీ ఎల్ఎల్బీ చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ చిత్రంలో హీరోయిన్ గీతికా త్యాగి ఆరోపించింది. ఆమె రహస్యంగా తీసిన వీడియోలో అతడు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసినట్లుంది. ఈ వీడియోను ఆమె తన ట్విట్టర్ పేజీలో కూడా అప్లోడ్ చేసింది. దాదాపు ఏడాది క్రితం ఈ సంఘటన జరిగిందంటూ మీడియాలో ఒకవర్గం చెబుతుండగా, ఆమె మాత్రం తన ట్విట్టర్లో దీనిపై యుద్ధం కొనసాగిస్తోంది.

సుభాష్ కపూర్ భార్య డింపుల్ ఖర్బందా, గీతికా త్యాగి బోయ్ ఫ్రెండ్ అతుల్ సబర్వాల్ కూడా ఈ వీడియోలో ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ సంఘటన గురించి తాను ఒక్కరోజు కూడా మర్చిపోలేదని, ఆమెకు సాయం చేయాలనే అనుకుంటున్నానని ఆ వీడియోలో సుభాష్ కపూర్ చెప్పినట్లుంది. జరిగిన సంఘటనకు తాను ఎంతో పశ్చాత్తాప పడుతున్నానని కూడా అన్నాడు. తన కొడుకు భవిష్యత్తు గురించి తాను బెంగపడుతున్నట్లు కపూర్ భార్య కూడా చెప్పింది.

గతంలో పాత్రికేయ వృత్తిలో ఉండి.. 'వన్ బై టు', 'వాట్ ద ఫిష్' లాంటి చిత్రాల్లో నటించిన గీతిక.. ఈ వీడియోలో పిచ్చిపట్లినట్లు ఏడుస్తూ, సుభాష్ కపూర్ను తిడుతూ కనిపించింది. ఈ సంఘటన తర్వాత తాను ఎవ్వరినీ నమ్మలేకపోతున్నానని ఆమె చెప్పింది. తాను జర్నలిస్టు కావడంతో ఆయన ఎనిమిదేళ్లుగా తెలుసని కూడా గీతిక తెలిపింది. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా బయటపెట్టడానికి తనను ప్రోత్సహించిన సబర్వాల్కు కృతజ్ఞతలు చెప్పింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి