దుస్తులపై విమర్శలు‌.. హీరోయిన్‌ ఆగ్రహం

26 Dec, 2019 09:25 IST|Sakshi

నటి ఆండ్రియాకు కోపం వచ్చింది. సంచలన నటిమణుల్లో తన రూటే సెపరేట్‌ అనిపించుకున్న నటి ఈ బ్యూటీ. నా జీవితం నా ఇష్టం. ఎవరేమనుకుంటే నాకేంటి అనేలా ప్రవర్తించే ఆండ్రియా ఇటీవల వార్తల్లో కనిపించలేదు. అసలు సినిమాల్లోనే కనిపించలేదు. వడచెన్నై చిత్రం తరువాత ఈ భామను తెరపై చూడలేదు. అంతేకాదు తన టైమ్‌ బాగోలేదో, లేక తొందరపాటు నిర్ణయంతోనో గానీ జీవితంలో కొంత గడ్డుపరిస్థితిని చవిచూసింది. 

ఈ విషయాన్ని తనే ఇటీవల బహిరంగంగా చెప్పుకుని బాధపడింది కూడా. తాను ఒక వివాహితుడితో సహజీవనం చేసి మానసికంగానూ, శారీరకంగానూ చాలా కోల్పోయానని ఆవేదనను వ్యక్తం చేసింది. అలాంటి ఆండ్రియా ఇప్పుడు మళ్లీ వార్తల్లో తరచూ కనిపిస్తోంది. నటిగానూ బిజీ అవుతోంది. ఇకపోతే ఇటీవల ఈ అమ్మడు చేసిన డ్యాన్స్‌ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో యూత్‌ను మజా చేసిందనే చెప్పాలి. 

అయితే అందులో ఆండ్రియా ధరించిన దుస్తులే విమర్శలకు దారి తీశాయి. అంతేకాకుండా ఆమెపై గాటుగా విమర్శిస్తున్నారు. దీంతో ఆండ్రియాకు చిర్రెత్తు కొచ్చింది. తన డాన్స్‌ను మాత్రమే ఎంజాయ్‌ చేయాలి గానీ, ధరించిన దుస్తుల గురించి కామెంట్స్‌ కొడతారా అంటూ రుసరుసలాడింది. ఏదేమైనా మరోసారి తన అసలు నైజాన్ని ఆండ్రియా నెటిజన్లకు చూపించింది. కాగా ప్రస్తుతం ఈ జాణకు అవకాశాలు వరుసకడుతున్నాయి. 

విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తోంది. దీనితో పాటు  కా, వట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. అన్నట్లు ఇటీవల ఆయుర్వేద వైద్యంతో కొత్తందాలను సంతరించుకున్న ఆండ్రియా ఆ విషయాన్ని అందరికీ తెలియజేయడానికే శృంగారభరిత డాన్స్‌తో కూడిన వీడియోను విడుదల చేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. మొత్తం మీద తన ప్రయత్నం ఫలించినట్లే ఉంది. కోలీవుడ్‌లో మరో రౌండ్‌ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తోందన్నమాట.  

Va va pakkam va 😋 #aboutlastnight #birthdaygirl #thejeremiahproject Thanks @amritha.ram for this BOMB 👗 ❤️

A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) on

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు