నడిరోడ్డుపై డాన్స్‌ చేస్తా..!

16 Jul, 2020 09:55 IST|Sakshi

సినిమా: నడిరోడ్డుపై డాన్స్‌ చేస్తా అంటోంది నటి అంజలి. కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా బాధ అంతా ఇంతా కాదు. ఎంతోమందిని ఈ వైరస్‌ పొట్టన పెట్టుకుంటోంది. మరి ఎంతోమందిని ఆర్థిక సమస్యలకు గురి చేస్తోంది. ఇక పలువురికి అసహనానికి గురి చేస్తోంది. ఇలా ఈ మహమ్మారితో అందరూ ఏదో విధంగా బాధింపునకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాయి. అయినా ఇది ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన పలువురు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్థికంగా బలపడిన నటీనటులు కూడా కరోనా దెబ్బకు ఇంటిలోనే మగ్గిపోతున్నారు.

చాలామంది ఇంటి పనులు, శారీరక వ్యాయామాలు, యోగాతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాలలో తమ ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానంతో ముచ్చటిస్తూ కాలం గడుపుతున్నారు. అలా అంజలి కూడా ఇంటి పనులు, కసరత్తులు, డాన్స్‌లతో టైంపాస్‌ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన ఇన్‌స్ట్ర్రాగామ్‌లో తాను మిద్దెపై డాన్స్‌ చేస్తున్న ఫొటోను పోస్టు చేసింది. అందులో అంజలి పేర్కొంటూ కరోనా సమస్య ముగిసిన వెంటనే బయటికి వచ్చి నడిరోడ్డుపై డాన్స్‌ చేయాలనుందని పేర్కొంది. ఈ కరోనా కాలంలో ఈ అమ్మడు అంతగా బోర్‌గా ఫీల వుతోందన్నమాట. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో మూడు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అదే విధంగా నటి అనుష్కతో కలిసి నటించిన సైలెన్స్‌ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.  
 

Once this ends I wll celebrate like this 💃🏻 till then #throwback #dance #pic 🤷🏻‍♀️ #happy #sunday

A post shared by Anjali (@yours_anjali) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు