వైభవంగా నటి అర్చన వివాహం

15 Nov, 2019 12:28 IST|Sakshi

బిగ్‌బాస్‌ నటి అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంల వివాహం గురువారం ఘనంగా జరిగింది. మూడు ముళ్లతో వైవాహిక బంధానికి వారు స్వాగతం పలికారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా కుటుంబసభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి నిశ్చితార్థం అక్టోబర్‌ 3న జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం రాత్రి సంగీత్‌తో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. బుధవారం రాత్రి ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన(వేద), జగదీశ్‌ వివాహబంధంతో ఒక్కటయ్యారు.

అర్చన క్లాసికల్‌ డ్యాన్సర్‌. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ నటించి వెండితెరపై మెరిసింది. అయితే సరైన హిట్‌ లేకపోవటంతో అడపాదడపా చిత్రాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఇక బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ 1లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరికీ సుపరిచితురాలయ్యింది. ఈ షోతో తగిన గుర్తింపు తెచ్చుకున్న అర్చన పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. తాజాగా వజ్రకవచధర గోవిందా అనే చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా