సీరియల్‌ నటి రాత్రిపూట రోడ్డుపక్కన...

16 Oct, 2017 19:55 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : నెయ్యట్టిన్కర ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి. రాత్రి పూట రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్‌. అక్కడ ఒక మధ్య వయస్కురాలైన ఓ మహిళ దోశెలు వేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఆమెను చూసి షాక్‌ తిన్నాడు. ఆమెతో కాసేపు మాట్లాడి.. అదంతా వీడియో తీసి తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అంతే అదిప్పుడు అక్కడ పెద్ద న్యూస్‌గా మారింది. 

ఇంతకీ ఆమె ఎవరో కాదు మాలీవుడ్‌ సీరియల్‌ కవితా లక్ష్మీ. ఏషియన్‌ నెట్‌ ఛానెల్‌లో ప్రసారం అయ్యే స్త్రీ ధనం సీరియల్‌తో ఆమె బాగా ఫేమస్‌. ఏదో సీరియలో లేక రియాల్టీ షోలో భాగంగా ఆమె ఇలా చేసిందనుకుంటే పొరపాటే. జీవితంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కుంటున్న ఆమె పగటి పూట నటిస్తూ.. రాత్రిపూట ఇలా హోటల్‌ నిర్వాహణతో కుటుంబాన్ని వెలదీస్తోందంట. ఈ విషయాలను ఆమె స్వయంగా  మనోరమ పత్రికకు వెల్లడించారు. 

ఆరు నెలల క్రితం ఆమె తన కొడుకు ఆమె యూకేకు పంపించారు. అయితే ట్రావెల్‌ ఏజెన్సీ సంస్థ వారు దారుణంగా మోసం చేయటంతో ఇప్పుడు అతను అక్కడ కష్టాలు ఎదుర్కుంటున్నాడు. దీంతో ఆమె తెలిసినవారినల్లా సాయం కోసం చెయ్యి చాచింది. ప్రోడక్షన్‌ కంట్రోలర్‌ మనోజ్‌, నిర్మాత మనోజ్‌ పానికర్‌లు మాత్రమే కొంత సాయం చేయగా.. ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రాలేదంట. కష్టాలు పెరిగిపోతుండటంతో ఉన్న డబ్బుతో ఓ గ్రానైట్‌ షోరూమ్‌ను ఓపెన్‌ చేసి.. దాని ద్వారా లోన్‌ కోసం యత్నించారంట. కానీ, కుదరకపోవటంతో చివరకు దాన్ని మూసేశారంట. 

ఇలా చివరకు ఏ దారి లేకపోవటంతో ఓ హోటల్‌లో కూడా పని చేసినట్లు ఆమె చెబుతున్నారు. ‘నేను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నా. నా కుమారుడికి ఇలా కష్టపడి నెలనెలా డబ్బులు పంపుతున్నా. ఇప్పుడు నా బాధల్లా కూతురి గురించే’ అని ఆమె చెబుతున్నారు. అన్నట్లు మళయాళ మెగాస్టార్‌ మమ్మూటీ రికమండేషన్‌తో ఈ మధ్యే ఆమెకు రెండు సీరియళ్లలో అవకాశాలు దక్కాయంట. అయినా హోటల్‌ నిర్వాహణ మాత్రం ఆపనని కవిత అంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వాల్మీకిని రిలీజ్‌ కానివ్వం’

సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి

లత విమర్శించినా.. రాణు మాత్రం..!

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

భయపెడుతూ నవ్వించే దెయ్యం

లేడీ సూపర్‌స్టార్‌

నవ్వులే నవ్వులు

గద్దలకొండ గణేశ్‌... రచ్చ రచ్చే

శ్రీముఖి.. అవకాశవాది : శిల్పా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి

‘సాహో’ రిలీజ్‌ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్‌

ఫన్‌ రైడ్‌.. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’

భయపెట్టేందుకు వస్తున్నారు!

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌

పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి

‘వాల్మీకిని రిలీజ్‌ కానివ్వం’

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌