నటి పెళ్లి సందడి మొదలైంది.. వైరల్

21 Jan, 2018 20:36 IST|Sakshi

సాక్షి, త్రిసూర్: దక్షిణాది నటి భావన మరికొన్ని గంటల్లో చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌ను వివాహం చేసుకోనున్నారు. నటి కుటుంబంలో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి రెండు రోజుల ముందు కొందరు సన్నిహితుల సమక్షంలో శనివారం భావన మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో మేలిమి బంగారంలా భావన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గతేడాది మార్చి 9న నవీన్‌, భావనల ఎంగేజ్‌మెంట్ జగిన సంగతి విదితమే. కాగా చాలాకాలం తర్వాత కేరళలోని త్రిసూర్ లో 'లులు కన్వెన్షన్ సెంటర్'లో రేపు (జనవరి 22న) వీరి వివాహం జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. వీరి మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా త్రిసూరు చేరుకుంటున్నారు. మెహందీ ఫంక్షన్‌ నటి భావన స్వగృహంలో చేసినట్లు సమాచారం. సోమవారం భావన వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొందరిని మాత్రమే వివాహానికి ఆహ్వానించామని, చాలా సింపుల్‌గా శుభకార్యం నిర్వహించనున్నట్లు నటి కుటుంసభ్యులు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు