వ్యవసాయం చేస్తున్నా

13 Apr, 2020 00:19 IST|Sakshi
భూమి ఫడ్నేకర్‌

ఖాళీ సమయంలో వంటలు చేయడమో, బొమ్మలు గీయడమో, ఏదైనా నేర్చుకోవడమో.. ఇలా ఏదో ఒకటి చేస్తూ సినిమా స్టార్స్‌ కాలక్షేపం చేస్తున్నారు. హీరోయిన్‌ భూమి ఫడ్నేకర్‌ మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ (నేల అవసరం లేకుండా పండ్లు, కూరగాయల పెంపకం) చేస్తున్నారు. ‘‘మా అమ్మ (సుమిత్ర), నేను ఎప్పట్నుంచో హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ గురించి ఆలోచిస్తున్నాం.

ఇప్పుడు ఆచరణలో పెట్టాం. హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ ద్వారా మా గార్డెన్‌లో కూరగాయలను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫార్మింగ్‌ గురించి నాకు తెలియని విషయాలను నిపుణులను అడిగి తెలుసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు భూమి ఫడ్నేకర్‌. ఇక సినిమాల పరంగా అయితే ప్రస్తుతం ‘దుర్గావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది. తెలుగులో హిట్‌ సాధించిన అనుష్క ‘భాగమతి’ చిత్రానికి ‘దుర్గావతి’ హిందీ రీమేక్‌.

మరిన్ని వార్తలు