ఆ నకిలీ అకౌంట్‌ నాది కాదు: కలర్స్‌ స్వాతి

6 May, 2020 12:29 IST|Sakshi

సినీ సెలబ్రిటీల పేరు మీద సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాలను క్రియేట్‌ చేయటం అకతాయిలకు సరదాగా మారుతోంది. రోజురోజుకు ఈ ఫేక్‌ అకౌంట్ల  సమస్య సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితానికి ముప్పుగా మారుతోంది. తాజాగా తన పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా చలామని అవుతున్నట్లు గుర్తించి హీరోయిన్‌ కలర్స్‌ స్వాతి తీవ్రంగా మండిపడ్డారు. ‘వారం రోజుల తర్వాత నేను ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చాను. @swathireddyoffl అనే ట్విటర్ అకౌంట్‌ నాది కాదు. అసలు నాకు ట్విటర్ ఖాతానే లేదు. అదేవిధంగా నాకు ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కూడా లేదు. నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను 2011లోనే తొలగించాను. నేను ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కలిగి ఉన్నానో తెలియదు. (తండ్రి పాత్రలో నటించడానికి రెడీ: కరణ్‌)

కానీ, ఇలాంటి సందర్భంలో నాకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. నా పేరుతో ట్విటర్‌లో నకిలీ అకౌంట్‌ ఉన్నట్లు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు. నకిలీ ప్రొఫైల్స్‌, ఆర్టికల్స్‌, సోషల్‌ మీడియాలో పోస్టులు, నకిలీ సంబంధాలు ఉన్న ఈ కాలంలో ఉండటం కంటే పాత కాలంలోకి వెల్లడమే మంచిది’ అని ఆమె చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. స్వాతి 2018లో వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె ఏ సినిమాలో నటించలేదు. ఇక కార్తికేయ-2 చిత్రం ద్వారా స్వాతి మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. 

Checked Instagram today after a week and it’s this, @SwathiReddyOffl Twitter handle is NOT mine. Am NOT on Twitter. I never will be. Am NOT on Facebook. I quit it in 2011. ( I have a page handled by someone else, which is dormant ) And. I don’t know why am still on Instagram. Maybe it provides a voice to say the below. Those of you who brought it to my notice, thank you. This account keeps returning and coming to my notice. ( who are you boss? #Darr ) If you have Twitter and the energy, then please flag it, I have not had much power over what’s written and said about me in the past. I know this shouldn’t matter, it’s not a big deal, am not so relevant also currently blah blah but home girl is just tired of fake. I don’t understand the patience to be a fake me when the real me is not able to be herself completely online. Fake profiles, Fake articles, fake posts, fake relationship standards, fake images, fake positive. Take me back to the 90s where a landline ensured more quality conversations, power cuts because of a drizzle and not a quarantine meant bonding, softy ice cream and egg puffs was standard socialising and Doordarshan was enough stimulation. #Uff #Lol

A post shared by Swathi (@swati194) on

మరిన్ని వార్తలు