నాగ్‌-వర్మ.. ఓ కొత్త అమ్మాయి

30 Nov, 2017 14:14 IST|Sakshi

సాక్షి, సినిమా : తన కొత్త చిత్ర హీరోయిన్‌ విషయంలో వస్తున్న పుకార్లకు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. నాగార్జున సరసన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసినట్లు తన ఫేస్‌బుక్‌ పేజీలో అధికారికంగా ధృవీకరించాడు. 

‘‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివి‘‘ అంటూ ఓ సందేశంతో స్పష్టత ఇచ్చాడు.

చాలా కాలం తర్వాత నాగ్‌ సరసన ఓ ఫ్రెష్‌ ఫేస్‌ నటిస్తుండటం విశేషం. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వర్మ కంపెనీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్‌ ఓ పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతోంది.

మరిన్ని వార్తలు