నా త‌ల్లికి క‌రోనా.. స‌హాయం చేయండి : న‌టి

13 Jun, 2020 12:50 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా సోకిన త‌న త‌ల్లిని ఆసుప‌త్రిలో చేర్పించ‌డానికి స‌హాయం చేయాల‌ని ఢిల్లీ ప్ర‌భుత్వాన్ని న‌టి దీపికా సింగ్ అభ్య‌ర్థించారు. స‌ద‌రు మెడిక‌ల్ సిబ్బంది దీనికి సంబంధించిన‌ రిపోర్టులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించ‌లేక‌పోతున్నామ‌ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వెంట‌నే త‌మ‌కు స‌హాయం చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీల‌ను ట్యాగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని హార్డింగ్ మెడిక‌ల్ కాలేజీలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా త‌న త‌ల్లికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో షాక్‌కి గుర‌య్యామ‌ని, ప్ర‌స్తుతం త‌న త‌ల్లి చాలా నీరసంగా ఉన్నారని ఆవేదన చెందారు. ఢిల్లీలో త‌న‌కు తెలిసిన కొన్ని ఆస్పత్రులను ఫోన్‌లో సంప్రదించగా బెడ్లు ఖాళీగా లేవ‌న్న స‌మాధానమే వ‌చ్చింద‌ని వెల్లడించారు. దీపికా పోస్ట్‌పై ప‌లువురు నెటిజ‌న్లు స్పందిస్తూ.. మీలాంటి సెల‌బ్ర‌టీల ప‌రిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య  క‌రోనా రోగుల‌కు ఎలా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారో అంటూ  ఆశ్చ‌ర్యం వ్య‌క్తం  చేశారు.
(కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కేసులు )

ఎప్పుడూ ఇంట్లోనే ఉండే త‌న తల్లికి క‌రోనా ఎలా సోకిందో అర్థం కావ‌డం లేద‌ని ఇన్‌స్టా వేదిక‌గా వాపోయిన దీపిక‌.. త‌మ‌ది ఉమ్మ‌డి కుటుంబం అని ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో 45 మంది ఒకే ద‌గ్గ‌ర నివ‌సిస్తున్నార‌ని చెప్పారు. దీంతో మిగ‌తా వారికి కూడా క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని దీపికాసింగ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే త‌న నానమ్మ‌,  తండ్రికి జ్వ‌రం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉంద‌ని దీంతో వారికి కూడా క‌రోనా సోకిందేమో అని అనుమానం వ్య‌క్తం చేశారు. కాబ‌ట్టి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మిగ‌తా కుటుంబ‌ స‌భ్యుల‌కి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వానికి విఙ్ఞ‌ప్తి చేశారు. (పీజీఐఎమ్‌ఈఆర్‌ ఆస్పత్రిలో ఫలించిన ప్లాస్మా థెరపీ )

‪My mom & dad are in Delhi. The test has been done in Lady Hardinge hospital & they didn’t give reports . They only allowed my father to click its picture. I really hope the concerned personell are reading this and my mom there receives some relief. We need your help . HNO 8365 Arya Nagar , Pahar Ganj , New Delhi 110055 , Near Ashoka Hotel at Aarakashan road . plz contact my husband Rohit 9833649679 @arvindkejriwal @narendramodi 🙏

A post shared by Deepika Singh Goyal (@deepikasingh150) on


దీపికా సింగ్ పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్ కావ‌డంతో శ‌నివారం ఆమె  త‌ల్లిని హాస్పిట‌ల్‌లో చేర్పించామ‌ని డిప్యూటీ కమిషనర్ అభిషేక్ సింగ్ ట్వీట్ చేయ‌గా ఇంకా లేదు. మా అమ్మ ఇంట్లోనే ఉంది అంటూ దీపికా రిప్లై ఇచ్చారు. త‌న నానమ్మ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వెంట‌నే ఆమెను హాస్పిట‌ల్‌లో చేర్పించాల‌ని కోరారు. దియా అవుర్ బాతీ హ‌మ్ సీరియ‌ల్ ద్వారా దీపికా సింగ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే.

మరిన్ని వార్తలు